Thursday, October 08, 2009

ఎన్టీఆర్‌ ట్రస్టుకు రూ.20లక్షలు ఇచ్చిన జూ.ఎన్టీఆర్‌



ఎన్టీఆర్‌ మనుమడు, ప్రముఖ సినీ హీరో జూని యర్‌ ఎన్టీఆర్‌ వరద బాధి తుల సహాయార్ధం ఎన్టీ ఆర్‌ ట్రస్ట్‌కు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చా రు. ఈ చెక్‌ను ఆయన బుధవారం స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయు డుకు సమర్పించారు. జూనియర్‌ఎన్టీఆర్‌ మంగళవారం కాంగ్రెస్‌నేతల సమక్షంలో ముఖ్యమం త్రి రోశయ్యకు సిఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.20లక్షలు అందించడంపై టిడిపి వర్గాలు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్‌ అనుస రించిన వైఖరిపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌ ట్రస్టుకు కూడా మరో రూ.20 లక్షల విరాళం అందించి, పార్టీ కేడర్‌ను కొంతమేరకు సంతృప్తి చేయగలిగారు.

బాలకృష్ణ విరాళం రూ.20లక్షలు
వరద బాధితుల సహాయార్ధం ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి పేరున ఉన్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.20లక్షల విరాళం ఇచ్చినట్లు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నేడిక్కడ ప్రకటించారు. అలాగే హెరిటేజ్‌ యాజ మాన్యం, సిబ్బంది తరఫున చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరుతో రూ.20 లక్షల విరాళం ఎన్టీఆర్‌ ట్రస్టుకు సమర్పించారు. కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 75కుటుంబాలకు ఈ వస్తుసామగ్రిగల ప్యాకెట్లు పంపిణీ చేయడానికి తరలించినట్లు ఆ ట్రస్టు సిఇఓ పి రఘురామారావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కొన్ని ప్యాకెట్లలో పిల్లలకు ఒక జత బట్టలు ఉన్నట్లు తెలిపారు. దుస్తుల ప్యాకెట్లతోపాటు బిస్కెట్లు,బియ్యం, మందులను కూడా ఆయా ప్రాం తాలకు పంపిస్తున్నట్లు తెలిపారు.

మహబూ బ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తి, ఐజ,పెబ్బేరు,ఆలంపూరు,కొల్లాపూరు,రాజోలు, కర్నూలు జిల్లాలోని కర్నూలు, మంత్రాలయం,నందికొట్కూరు, పాణ్యం ప్రాంతాలకు లారీలలో ప్యాకెట్లను తర లించామని తెలిపారు. గుంటూరు, నల్లగొండ జిల్లాలలోని వరద ముంపు ప్రాం తాలలో కూడ దుస్తుల ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు లారీలు సిద్ధం చేశా మన్నారు. ట్రస్టు వద్ద రూ.50లక్షల విలువజేసే మందులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, దాదాపు 35వైద్య సహాయక కేంద్రాల ద్వారా కర్నూలు, మహ బూబ్‌నగర్‌,గుంటూరు,నల్లగొండ జిల్లాల్లో తమ ట్రస్టు సేవలు అందిస్తున్నదని తెలిపారు


No comments:

Post a Comment